Gold Prices:భారీగా తగ్గుతున్న బంగారం ధర.. ట్రంప్ చెప్పిన ఒక గుడ్ న్యూస్ తో ... తులం పసిడి ఏకంగా రూ. 8000 ఢమాల్ అయ్యే ఛాన్స్
బంగారం ధరలు అనుకున్న దానికన్నా చాలా వేగంగా తగ్గుతున్నాయి. గడచిన 48 గంటల్లోనే బంగారం ధర భారీగా తగ్గింది ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 93 వేల రూపాయల సమీపంలో ఉంది. గత వారం ఇదే బంగారం దాదాపు లక్ష రూపాయల సమీపంలో ఉంది. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ కారణాలతో పాటు ఇతర కారణాల గురించి తెలుసుకుందాం.
Gold Prices: భారీగా తగ్గుతున్న బంగారం ధర.. ట్రంప్ చెప్పిన ఒక గుడ్ న్యూస్ తో ... తులం పసిడి ఏకంగా రూ. 8000 ఢమాల్ అయ్యే ఛాన్స్
బంగారం ధరలు అనుకున్న దానికన్నా చాలా వేగంగా తగ్గుతున్నాయి. గడచిన 48 గంటల్లోనే బంగారం ధర భారీగా తగ్గింది ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 93 వేల రూపాయల సమీపంలో ఉంది. గత వారం ఇదే బంగారం దాదాపు లక్ష రూపాయల సమీపంలో ఉంది. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ కారణాలతో పాటు ఇతర కారణాల గురించి తెలుసుకుందాం.
Gold Prices
బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా ప్రపంచ మార్కెట్లలో తగ్గుతున్న పసిడి ధరలే కారణమని చెప్పవచ్చు. అమెరికాలో మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్లో పసిడి ధర ఒక ట్రాయ్ ఔన్స్ కు 3500 డాలర్ల నుంచి 3150 డాలర్లకు తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి.
బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల సౌదీ అరేబియా తో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలతో పాటు సిరియా వంటి దేశాలతో కూడా త్వరలోనే ఒప్పందం చేసుకుంటానని ప్రకటించారు దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న పలు వివాదాలు సమసిపోయే అవకాశం ఉంది కనుక మార్కెట్లో దీనిని పాజిటివ్ పద్ధతిలో చూస్తున్నాయి
స్టాక్ మార్కెట్స్ పాజిటివ్ పద్ధతిలో కదులుతూ ఉంటే, బంగారం మాత్రం తగ్గడం ప్రారంభించింది. ఎందుకంటే బంగారం ధరలు తగ్గడానికి, ప్రధానంగా బంగారం పట్ల డిమాండ్ తగ్గడమే ఒక కారణంగా చెప్పవచ్చు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారు.
బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను నెమ్మదిగా డాలర్ బాండ్ల వైపు అదే విధంగా స్టాక్ మార్కెట్ల వైపు తరలిస్తున్నారు.
Disclaimer:
పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు టైమ్స్ నౌ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు. టైమ్స్ నౌ తెలుగు తన పాఠకులకు డబ్బు, పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.
మరోవైపు ఫ్యూచర్ మార్కెట్లలో కూడా బంగారం ధర భారీగా తగ్గింది దేశీయ ఎంసీఎక్స్ సూచిలో జూన్ 5వ తేదీ కాంట్రాక్టు ఫ్యూచర్స్ ధర 10 గ్రాముల బంగారం విలువ రూ. 92475 గా పలుకుతోంది.